26న డ్రాయింగ్, ట్రెజరీ అధికారులకు శిక్షణ


Wed,March 20, 2019 03:02 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి19: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు, ట్రెజరీ శాఖ సిబ్బందికి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్‌ఎంఐఎస్) నూతన సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా ఖజానాధికారి జీ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ట్రెజరీ శాఖలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం కొత్త సాప్ట్‌వేర్ విధానాన్ని అమలు చేయనుందన్నారు. డ్రాయింగ్ అధికారులు, డీడీవో రిక్వెస్ట్ ద్వారా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్‌ఎంఐఎస్) ద్వారా బిల్లులు తయారు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే, ట్రెజరీ అధికారులు కూడా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్‌ఎంఐఎస్)ద్వారానే బిల్లులు పాస్ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకుగాను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు, ట్రెజరీ శాఖ సిబ్బందికి (ఐఎఫ్‌ఎంఐఎస్) నూతన సాప్ట్‌వేర్ విధానంపై ఈ నెల 26వ తేదీ మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇవ్వనున్నట్ల చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన పిగ్సెల్‌వైడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శిక్షణ ఇవ్వనున్నారని, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహాబూబాబాద్, జయశంకర్‌భూపాల్‌పల్లి, ములుగు జిల్లాల పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, ట్రెజరీ శాఖ సిబ్బంది ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...