జయంతి రోహుతో అధిక లాభాలు


Wed,March 20, 2019 03:02 AM

మామునూరు, మార్చి 19 : నూతన రకమైన జయంతి రోహు చేపతో మత్స్యకారులు, రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని మామునూరులోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (కేవీకే) కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవీడు గ్రామంలోని రైతు బ్రహ్మచారి-జ్యోతి చేపల చెరువు వద్ద చేపలను కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. చెరువులోని చేపల సగటు బరువును మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ బాలాజీ చూశారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి సహకారంతో చేపలకు రూ. 7వేల విలువైన 200 కిలోల మేత, మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడారు. చేపల చెరువుల సాగు, జయంతి రోహు చేపపై రైతులకు వివరించారు. జయంతి రోహు చేపలు త్వరగా పెరుగుతాయని, తల్లి చేపలు తొందరగా అభివృద్ధి చెందుతాయన్నారు. అలా పెరిగిన చేపలను కేవీకేకు అందించాలని, వాటి ద్వారా ఇక్కడ చేపపిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తామన్నారు. జయంతి రోహుకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఇది జన్యుపరమైన లక్షణాలను కలిగి సాధారణ చేపకంటే 18 శాతం అధికంగా పెరుగుతుందని చెప్పారు. మిగతా చేపలతో పోలిస్తే రెండు నెలల ముందే కేజీ బరువుకు వస్తుందని వివరించారు. ఈ చేపల సాగు రైతుకు అధిక లాభాలు తెచ్చిపెడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్షేత్ర ప్రదర్శనలో కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్‌జ్యోతి, రైతులు మహేష్, సేనాపతి, నర్సయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత
వరంగల్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన కానిస్టేబు ల్ భూక్య వెంకన్న కుటుంబానికి చేయూత పథకం కింద సీపీ రవీందర్ లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అం దించారు. వెంకన్న భార్య సీపీ చేతుల మీ దుగా చెక్కును అందుకున్నారు. ఈ సంద ర్భంగా కానిస్టేబుల్ కుటుంబ పరిస్థితిని సీపీ తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ ను వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...