ముగిసిన రైతుల శిక్షణ తరగతులు


Wed,March 20, 2019 03:02 AM

మామునూరు, మార్చి 19 : గ్రామీణ యువ రైతులకు వ్యవసాయ సాగుపై మెళకువలు నేర్పి, వారిని లాభసాటి పంటలు పండించే వ్యవసాయదారులుగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణను అందిస్తున్నారు. నగరంలోని ఆరో డివిజన్ మామునూరులోని కేవికే ( కృషి విజ్ఞాన కేంద్రం ) లో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసింహా అధ్యక్షతన కొద్ది రోజులుగా 30 మంది గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయ సాగు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంపై నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన నరసింహా శిక్షణ పూర్తి చేసుకొన్న రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే చివరి రోజు శిక్షణలో సేద్యవిభాగపు శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత, మిశ్రమ పంటల విధానం, పంట మార్పిడి, పప్పుజాతి పంటల్లో విత్తనశుద్దికి రెజోబియం కల్చర్ విధానం, నీటిని ఆదా చేసుకునే విధానాలను రైతులకు వివరించారు. అనంతరం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి బ్యాక్టీరియా తయారీ, ట్రైకోడెర్మా పని విధానం, తద్వారా తెగుళ్ల నివారణ, వైరస్ తెగులు నిర్దారణ, వాటి నివారణకు రైతులు తీసుకొనే చర్యలను వారికి తెలియజేశారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ అరుణ్‌జ్యోతి, డాక్టర్ బాలాజీ, డాక్టర్ శివ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నా

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...