ముగిసిన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు


Wed,March 20, 2019 03:00 AM

సిద్ధార్థనగర్, మార్చి19: చైతన్యపురి కాలనీలో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఆరో రోజుతో ముగిశాయి. బ్రహ్మోత్సవ యజ్ఞాచార్యులు శ్రీమాన్ టీకే శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో యాగశాల వద్ద భక్తుల పూజల అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. మహా మంటపంలో పారాయణం, అవభృధోత్సవం తర్వాత స్వామి వారికి 25 కలషాలతో అభిషేకం చేశారు. స్వామి వారికి చక్రవరి(చక్రస్నానం) నిర్వహించారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా పుష్పయాగం నిర్వహించి, స్వామికి 20కిలోల రకరకాల పుష్పాలతో పూజించారు. 12రకాల ప్రసాదాలతో ప్రత్యేక నివేదన చేసి, బ్రహ్మోత్సవాల ముగింపునకు గుర్తుగా దేవతోద్వాసన పలికారు. ప్రారంభంలో అధిరోహించిన గరుడధ్వజాన్ని అవరోహించడంతో బ్రహ్మోత్సవాలు పూర్తయినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు పంజాల అశోక్‌కుమార్, ఉపాధ్యక్షులు ఐలేని వెంకటమల్లారెడ్డి, గంపా శంకరయ్య, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ వడ్డెపల్లి నరేందర్, కోశాధికారి పెద్ది అశోక్‌కుమార్, సహాయ కార్యదర్శులు తిరునగరి దిలీప్‌కుమార్, శనిగారం సుజాత, సభ్యులు రాచర్ల మధులత, సాదం రవిచంద్ర, పిట్ట వెంకటేశ్వర్లు, రాజన్న, సమ్మయ్య, రవి, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...