మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు


Wed,March 20, 2019 03:00 AM

-ఉగ్గె చంద్రమౌళి విడుదల
భీమదేవరపల్లి: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి అలియాస్ మదన్‌లాల్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. 14ఏళ్లుగా మహారాష్ట్ర జైలులో ఆయన జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. కాగాచంద్రమౌళి జీవిత ఖైదును రద్దు చేస్తూ మహారాష్ట్రలోని బాలఘడ్ కోర్టు పదిరోజుల క్రితం తీర్పునిచ్చింది. దీంతో స్వగ్రామం మాణిక్యాపూర్‌లో ఆనందం నెలకొంది. అతడి కుటుంబ సభ్యులు ఉగ్గె చంద్రమౌళిని స్వగ్రామం తీసుకొచ్చేందుకు తరలివెళ్లారు. చంద్రమౌళి నక్సలిజం వైపు ఆకర్షితుడై 38ఏళ్లక్రితం అడవిబాట పట్టాడు. దళ సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్‌గా, మంథని, జగిత్యాల ప్రాంతాల్లో సైతం కీలకంగా పనిచేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. అనంతరం మహారాష్ట్రలోని నాగపూర్‌లో లాడ్జిలో చంద్రమౌళి ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాల్లో యాభైవరకు కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అరెస్టయిన చంద్రమౌళిని రవాణాశాఖ మంత్రి హత్య కేసులో ప్రధాన నిందుతుడిగా పేర్కొంటూ 2015లో జీవితఖైదును విధిస్తూ బాలఘడ్ కోర్టు తీర్పునిచ్చింది. రవాణాశాఖ మంత్రి హత్య కేసులో పోలీసులు 90మందిని సాక్షులుగా చేర్చారు. ఇందులో ఒక్కరు మినహా మిగిలినవారందరూ తమకు తెలియదని చెప్పడంతో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...