రంగంలోకి ఇంటెలిజెన్స్!


Sat,February 23, 2019 02:29 AM

- అద్దె గర్భం దందాపై కూపీ లాగుతున్న అధికారులు
-అకినేపల్లి మల్లారంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
-బాధిత మహిళలకు మంగపేట పోలీస్ కౌన్సెలింగ్?
మంగపేట, ఫిబ్రవరి09: అద్దె గర్భం దందాపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మంగపేట మండల సరిహద్దు గ్రా మాన్ని కేంద్రంగా చేసుకొని కొనసాగిస్తున్న ఈ అద్దె గర్భం దందాను ఈ నెల 7న ‘నమస్తే తెలం గాణ’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదిత మే. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు పోలీసు సిబ్బంది శుక్రవారం అకినేపల్లి మల్లా రానికి వెళ్లి కొంతమేర సమాచారాన్ని రాబట్టారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతం లో రెండు జీపులు, ఓ డీసీఎంలో పోలీ సు బలగాలు భారీగా అకినేపల్లిమల్లారం గ్రామా న్ని ముట్టడించడంతో ఏమీ జరిగిందోనని తొలుత స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు స్థానిక ఎస్సీ కాలనీ వాసుల తో ఈవిషయంపై కూలంకుషంగా మాట్లాడినట్లు సమాచారం. అనంతరం ఈ దందాలో భాగస్వా ములైన కొందరిని గుర్తించిన పోలీసులు వారిని మంగపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్లు తెలి సింది. వీరి ద్వారా దందాపై పోలీసులు వివరాలు తెలుసుకున్నట్లుగా సమాచారం. ప్రధానంగా పేద రికం కారణంగానే ఇందులో భాగస్వాములవు తు న్న స్త్రీలను కేవలం బాధితులుగానే పరిగిణించి వారికి పోలీసు శాఖ తరఫున తగిన కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వేర్వేరుగా రంగంలోకి దిగి అద్దె గర్భం వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగానే అకినేపల్లి మల్లారం గ్రా మంలోని కొందరు వ్యక్తులు, స్థానిక మీడియాతో ఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడి దీనికి సంబందించిన కొంత మేర వివ రాలు సేకరించారు. ఇదిలా ఉంటే అకినేల్లిమల్లారంలో ఉం డి గత మూడేళ్లుగా ఈదందాకు పాల్ప డుతున్న వారు పోలీసుల రాకను పసిగట్టి అందుబాటులో లేకుండా పోయినట్లు గ్రామం లో చర్చ జరుగుతుండడం గమనార్హం. మారు మూల గ్రా మీణ ప్రాంతాల పేద కుటుంబాలకు చెందిన స్త్రీలు ఈ దందాలో పడి భవిష్యత్ శారీరక రుగ్మతలకు గురికాకుండా ఉండాలని భా వించే పోలీసు శాఖ ఇక నుంచి ఈదందాకు పూర్తి స్థాయి పుల్ స్టాప్ పెట్టాలనే కోణంలో ముందుకెళ్తునట్లు తెలుస్తోంది.

సుమోటోగా విచారణ జరపాలి అద్దె గర్భం దందాపై పోలీసు శాఖ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని దళిత సంఘాల ముఖ్య నాయకులు కోరారు. మంగపే టలో వారు శనివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద అమాయక స్త్రీలకు రూ. ఐదు లక్షల డబ్బును ఆశగా చూపి అద్దె గర్భం దందా చేస్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరా రు. ఈ దందాను పూర్తి గా అరికట్టి పునరావృతం కాకుండా చూడాలన్నారు. సమావేశంలో దళిత సంఘాల నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, గోనె తిరుపతి, ఎంపెల్లి సమ్మ య్య, చెట్టుప ల్లి వెంకటేశ్వర్లు, దీగొండ కాంతారావు, రాజమల్ల సుకుమార్, తాలూక సంపత్, నిమ్మగడ్డ ప్రవీణ్, ఎడ్ల నరేశ్, సునారి చిరంజీవి, జంగం భానుచందర్, కాటూరి నాగయ్య, బండి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...