తొలగిస్తేనే మంచిది..


Sat,February 23, 2019 02:28 AM

-పత్తి పంటను పొడిగిస్తే ముప్పే..
-వచ్చే పంటకు గులాబీ పురుగును పెంచుకున్నట్లే..
-జిన్నింగ్ మిల్లుల్లోనూ చీడపీడల అవశేషాలు
- జాగ్రత్తలు తీసుకుంటేనే పత్తి పంటకు మనుగడ
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లాలో రైతులకు పత్తిపంట పెద్దదిక్కుగా మారింది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎన్నో ఏండ్లుగా రైతులను ఆదుకునే ఆపద్బంధువుగా పత్తిపంట నిలుస్తున్నది. రైతులు ముద్దుగా తెల్ల బంగారంగా పిలుచుకుంటున్న పత్తి పంటకు గులాబీ రంగు పురుగు రూపేణా గత రెండేళ్లుగా ముప్పు వాటిల్లింది. ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఈ మహమ్మారీ అన్నదాతల పాలిట శనిలా మారి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. కనీసం పంట కోసం పెట్టిన పెట్టుబడి కూ డా రాక రైతులు దిగాలు పడుతున్నారు.

నష్టం అపారంగా.. పత్తి పంటకు గులాబీ రంగు పు రుగు సోకితే నష్టం అపారంగా ఉం టుంది. నాణ్యతపై, దిగుబడిపై పెను ప్రభావం చూపుతుంది. ఈ పురుగు ఆశించిన పత్తి రంగును కోల్పోతుం ది. గింజలను తినటం వల్ల పత్తి బరువు తగ్గిపోతుంది. మొక్కల పెరుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. దిగుబడిగా వచ్చిన పత్తిని అ మ్మకానికి మార్కెట్లకు తీసుకెళ్లినపు డు కొనుగోలుదారులు ధర విష యంలో పేచీ పెడుతారు. పురుగు మందుల ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. నివారణ చర్యలు చేపడితేనే.. తెల్ల బంగారం సాగుపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ గులాబీ రంగు పురుగును పారదోలాలంటే నివారణ చర్యలే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పత్తిపంటను 200 రోజులకు మించి సాగులో ఉంచొద్దని అంటున్నారు. ఈ యేడాది మొదటి రెండు సార్లు ఏరిన పత్తిలో ఎక్కువగా గులాబీ రంగు పురుగు కనిపించనప్పటికీ మూడో సారి పంటకు మాత్రం విజృంభించింది. దీనివల్ల చివరగా ఏరిన పత్తిని ఇంట్లో నిల్వ చేసుకున్న పత్తిలో కలపడం వల్ల మొదటి పత్తి కూడా నాణ్యతను కోల్పోయినట్లయిం ది. పత్తిని రెండో సారి ఏరుకోగానే పంటను తీసేసి భూమిని కలియ దున్నాలి. అంతకు ముందు పత్తి ఏరిన తర్వాత పశువులను, గొర్రెలను అందులో మేపాలి. భూమిని దు న్నితే గులాబీ పురుగుల అవశేషాలు పూర్తిగా నాశనమవుతాయి. పత్తి కట్టెలు కూడా భూమి లోపల సేంద్రీయ ఎరువుగా మారుతుంది. నీటి వసతి ఉన్న వారు పత్తిని తీసేసిన తర్వాత స్వల్ప కాలిక పంటలు వేసుకుంటే మంచిది. అదే విధంగా జిన్నింగ్ మిల్లు యజమానులు కూడా వ్యర్థ్ధాలను నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు ధ్వంసం చేయాలి. మిల్లుల్లో కూడా లింగాకర్షక బుట్టలను వాడితే మంచిది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...