మహిళ ఆత్మహత్యాయత్నం


Sat,February 23, 2019 02:23 AM

పలిమెల: మండలకేంద్రానికి చెందిన చల్ల అరుణ(42)అనే మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అరుణ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పలిమెల గ్రామానికి చెందిన అరుణ గత కొన్నేళ్లుగా కిరాణం షాపు నిర్వహిస్తున్నది. కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుండడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స చేయింకుంది. ఈక్రమంలో శనివారం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోగా.. తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థానికులు అరుణను మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా విషయం తెలుసుకున్న మహదేవపూర్ సీఐ రంజిత్ అరుణను పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...