ఆకాశమే హద్దు..


Fri,February 22, 2019 02:05 AM

వరంగల్‌స్పోర్ట్స్, ఫిబ్రవరి 21: ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు ఓరుగల్లు పర్వతారోహకుడు రాసమల్ల అఖిల్. మైనస్ 20డిగ్రీల ఉష్ణోగ్రతలో 5895 మీటర్ల ఎత్తు(19340 అడుగులు)ఉన్న ఈపర్వతాన్ని అధిరోహించి విజయపతాకాన్ని ఎగురవేశాడు. రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో పాండవులగుట్ట, భువనగిరి ఖిల్లా వంటి కొండలపై సాధారణంగా ట్రెక్కింగ్ చేసే అలవాటున్న అఖిల్ కిలిమంజారో వంటి సాహసోపేతమైన పర్వాతారోహణ చేయడం ఇదే తొలిసారి కావడంతో పాటు ఈ పర్వతారోహణాన్ని తొలిసారే విజయవంతంగా ముగించడం విశేషం.

వారి స్నేహంతోనే పర్వతారోహణకు..
ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృస్టించిన తెలంగాణ రాష్ట్ర పర్వతారోహకులు ఆనంద్‌కుమార్, పూర్ణలతో గతంలోనే స్నేహసంబంధాలున్న అఖిల్ వారి ప్రేరణతోనే కిలిమంజారో అధిరోహించాడని అఖిల్ తండ్రి రవీందర్ చెప్పుకొచ్చారు. ట్రెక్కింగ్‌పై ఉన్న ఆసక్తితో పలు ట్రెక్కింగ్ పోటీల్లో పాల్గొనేవాడని అలా చేస్తున్న సమయంలోనే భువనగిరి, పాండవుల గుట్టలపై జరిగిన ట్రెక్కింగ్ ఎంపికల్లో ప్రాతినిధ్యం వహించి కిలిమంజారో పర్వతారోహణకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యాడు.

ఐదు రోజుల్లోనే లక్ష్య ఛేదన..
కిలిమంజారో పర్వతారోహణ చేయాలంటే దాదాపు 8 నుంచి 10రోజులు సమయం పడుతుందని నిష్ణాతుల అంచనా. కానీ అఖిల్ 15వతేదీన పర్వతారోహణ మొదలుపెట్టగా 20తేదీన పర్వతారోహణను పూర్తిచేసినట్లు తనకు సందేశం పంపినట్లు తండ్రి రవీందర్ వివరించారు.

అప్పు తెచ్చి మరీ..
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం ఎంత సాహసోపేతమైన విషయమో అంతకుతగ్గ ఖర్చుతో కూడుకున్నది. తన కుమారుడికి ప్రపంచంలో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అందుకు కావాల్సిన డ బ్బును సమకూర్చే సమయంలో రూ. 3లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని తండ్రి రవీందర్ చెప్పుకొచ్చారు. వరంగల్‌రూరల్ జిల్లాలోని దుగ్గొండి మండలానికి చెందిన అఖిల్ కుటుంబం 22ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడింది. ఆటోడ్రైవర్‌గా రవీందర్ పనిచేస్తుండగా తల్లి కోమల ఓ ప్రైవేట్ హాస్టల్‌లో వర్కర్‌గా పనిచే స్తూ కుటుంబ పోషణకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వీరిలో అఖిల్ పెద్దవాడు.

కలెక్టర్ నుంచి మొదలు అందరి చేయూత..
అఖిల్ కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికైన విషయం తెలియగానే చిలువేరు శంకర్ వంటి దాతలు తగిన సహాయసహకారాలు అందించేందుకు ముందుకొచ్చారు. ఆసమయంలో అర్బన్ జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ వంటి ప్రజాప్రతినిధులు తగిన ప్రోత్సాహాన్ని అందజేసి తనకు తగిన మానసిక, ఆర్థిక ైస్థెర్యాన్ని అందించినట్లు అఖిల్ తండ్రి వివరించారు.

నేటి సాయంత్రం రాష్ట్రానికి అఖిల్..
పర్వతారోహణ పూర్తిచేసుకొని ఆఫ్రికానుంచి తిరుగు పయనం అయిన అఖిల్ నేటి సాయంత్రానికి రాష్ర్టానికి వస్తారని అఖిల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే రాష్ర్టానికి రాగానే ముందుగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలుసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగాఅఖిల్ తండ్రి రవీందర్ మాట్లా డుతూ కిలిమంజారో పర్వతాన్ని అఖిల్ అధిరోహించినందుకు చాలా ర్వంగా ఉందంటున్నా డు.ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలుతెలిపారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...