సీఎంను కలిసిన టీఆర్‌వీకేఎస్ నాయకులు


Fri,February 22, 2019 02:02 AM

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్‌వీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు గురువారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. పలు కార్యాలయాల్లో సిబ్బంది, ఆర్టీజన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. 2011లో అపాయింట్ అయిన జూనియర్ లైన్‌మెన్లకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరారు. సంస్థలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న ఫోర్‌మెన్లకు ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాల్లో ఏర్పాటు కానున్న కొత్త కార్యాలాయాల్లో ఆర్టీజన్ కార్మికులను నియమించాలని కోరారు. రామగుండం, పాల్వంచ వోఎం ప్లాంట్లు మూసివేత దశలో ఉన్నాయని, అందులో పని చేస్తున్న కార్మికుల ఉద్యోగ భధ్రత కోసం కొత్త ప్లాంట్లను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు కార్మికుల కోసం చేసిన పనులపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంగా టీఆర్‌వీకేఎస్ నాయకుడు ప్రకాశ్ కూతురు వివాహ ఆహ్వాన పత్రిను సీఎంకు అందజేసి పెళ్లికి అందజేశారు. సీఎంను కలిసిన వారిలో కోడూరి ప్రకాశ్, దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

188
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...