గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం


Fri,February 22, 2019 02:02 AM

- జిల్లా పంచాయతీ అధికారి మహమూద్
హసన్‌పర్తి, ఫిబ్రవరి 21: గ్రామాల అభివృద్దిలో సర్పంచ్‌లే కీలకమని జిల్లా పంచాయతీ అధికారి మహమూద్ అన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతి విహార్ జిల్లా శిక్షణ కేంద్రంలో మొదటి విడత ప్రారంభమైన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం ఈవోపీఆర్‌డీ శ్యాం ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి మహమూద్ హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగించేందుకు సర్పంచ్‌లకు సుపరిపాలనపై శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మొదటి విడత కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి గ్రామాల్లోని 65 మంది సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడత శిక్షణలో భాగంగా మోడల్ గ్రామాలు, పల్లెల అభివృద్ధి, పారదర్శక పాలన, కొత్త పంచాయతీ రాజ్ చట్టం, పారిశుధ్యం, హరితహారం, అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిధుల వినియోగం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో సర్పంచ్‌లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మొదటి విడత శిక్షణలో భాగంగా రిటైర్డ్ డీపీవో సారయ్య, రిటైర్డ్ ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఈవోపీఆర్డీ శ్యాం, రవి సర్పంచ్‌లకు ఆదర్శ గ్రామాలు ఎలా ఉండాలి, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, నేపథ్యం ముఖ్యాంశాలు, నాయకత్వ లక్షణాలు, గ్రామ పంచాయతీల నిర్మాణం, విధులు, బాధ్యతలు, స్టాండింగ్ కమిటీ విధి విధానాలు, ప్లానింగ్ మెథడాలజీపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...