పదో రోజు 450 మంది అభ్యర్థుల అర్హత


Fri,February 22, 2019 02:02 AM

- కొనసాగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ దేహదారుఢ్య పరీక్షలు
- పర్యవేక్షిస్తున్న సీపీ రవీందర్
నయీంనగర్, ఫిబ్రవరి21: పోలీస్ రిక్రూట్‌మెంట్ దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా 10వ రోజు 450 మంది అభ్యర్ధులు అర్హత సాధించినట్లు సీపీ రవీందర్ పేర్కొన్నారు. మొత్తం 1000 మంది అభ్యర్థులకు గానూ 757 మంది అభ్యర్ధులు హాజరు కాగా, వీరిలో 450 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపికైనట్లు ఆయన వివరించారు. 36 మంది చాతి, ఎత్తులో అనర్హులుగా కాగా, 271 మంది 800 మీటర్స్‌లో అనుకున్న సమయంలో చేరుకోలేకా వెనుతిరిగారని తెలిపారు. అస్వస్థతకు గురైన అభ్యర్థులకు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవెంట్స్ వచ్చేటప్పడు పోలీస్ నియాయమక మండలి సూచించిన పత్రాలన్నీ తీసుకొని రావాలని సీపీ సూచించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...