అధికారులు అంకితభావంతో పని చేయాలి


Thu,February 21, 2019 03:15 AM

-సంక్షేమ ఫలాలు అర్హులకు అందజేయాలి
-పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి
-వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
-వానకాలం సీజన్‌కు సన్నద్ధం కావాలి
-జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ
-స్థాయి సంఘాల వారీగా సమీక్ష
న్యూశాయంపేట, ఫిబ్రవరి20: సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో అధికారుల అంకితభావంతో పని చేయాలని వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దల పద్మ అన్నారు. జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం బుధవారం జిల్లా పరిషత్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 1, 2, 4, 5, 6, 7వ స్థాయి సంఘాల సమావేశాలు శాఖల వారీగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై వరంగల్ అర్బన్, రూరల్, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు జిల్లాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై ఆమె మాట్లాడుతూ.. వచ్చే వానకాలం సీజన్‌కు సన్నద్ధం కావాలని సూచించారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. సబ్సిడీ పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించాలన్నారు. ఉమ్మడి జిల్లా విద్యాశాఖపై మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం జరగబోయే పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక, భోజన వసతి, అల్పహారం, అదనపు తరగతులు జరిగేలా చూడాలన్నారు. వైద్య శాఖాధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎండకాలం వస్తున్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ అందజేస్తున్న కిట్లను లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. సంక్షేమ శాఖాధికారుల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆమె అధికారులకు సూచించారు. అనంతరం పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యూఎస్, జాతీయ రహదారులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వారిని అప్రమత్తం చేశారు. ప్లానింగ్, సివిల్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ స్థాయి సంఘం సమీక్ష సమావేశం కోరం లేక వాయిదా పడింది. కార్యక్రంలో జెడ్పీటీసీలు సంజీవరెడ్డి, వేణు, రమాదేవి, శోభన్, రాంరెడ్డి, అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...