ఈ-గవర్నెన్స్‌తో సత్వర సేవలు


Thu,February 21, 2019 03:12 AM

-డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్-యూనివర్సిటీ వీసీ సీతారామారావు
మట్టెవాడ, ఫిబ్రవరి 20: ఈ-గవర్నెన్స్ సత్వరసేవలను అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కే సీతారామారావు అన్నారు. వరంగల్ ఎల్బీ కళాశాలలో ఈ-గవర్నెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యూకేషన్ స్ఫెషల్ రిఫరెన్స్ టూ రోల్ ఆఫ్ మొబైల్ గవర్నెన్స్(ఈ-గవర్నెన్స్) అనే అంశంపై జాతీయస్థాయి సదస్సు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ భాగ్యనారాయణ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతారామారావు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఈ టెక్నాలజీ సమాజ అభివృద్ధి, మానవ అభివృద్ధిలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉన్నత విద్యను మరింత వేగవంతంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పౌరసేవలు అందించడానికి ఎంతగానో తోడ్పాటునందిస్తుందన్నారు. ఈ-లెర్నింగ్, ఈ-గవర్నెన్స్‌ల ద్వారా తక్కువ ఖర్చుతో వేగవంతంగా పనులుపూర్తి చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. సమాచార వ్యాప్తిలో మొబైల్ గవర్నింగ్ సైతం ఎంతగానో తోడ్పాటునందిస్తున్నదని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జీఎన్ ఫణికుమార్ మాట్లాడుతూ మానవ సమాజ మార్పులో ఈ-గవర్నెన్స్‌ను ప్రత్యామ్నాయ ప్రభుత్వ సేవలుగా వాడుకున్న ప్రాంతాలు, ప్రభుత్వాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. సెమినార్‌కు పలు ప్రాంతాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి పరిశోధనా పత్రాలు రావడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి రవీంద్రసేన, ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ, డీహెచ్‌రావు, సెమినార్ డైరెక్టర్ డాక్టర్ కే రాజేందర్‌రెడ్డి, కో డైరెక్టర్ ఎస్వీ రమణారెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎం సదానందం, ఎం రాధిక, శృతి, డీ శ్వేత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

180
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...