ఉచిత శిక్షణకు ఎంపిక


Thu,February 21, 2019 03:11 AM

అర్బన్ కలెక్టరేట్, ఫిబ్రవరి 20 : కైరోస్ కాంపోసైట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ మైనార్టీ యువతకు ఆర్మీ, సీఆర్‌ఫీఎఫ్, హౌజ్‌కీపింగ్, కాల్‌కేర్ ఎగ్జిక్యూటీవ్, ఆన్‌ఆర్మ్‌డ్ సెక్యూరిటీ గార్డ్స్, ఈఎంటీబేసిస్ మొదలగు వాటిలో 45 రోజుల ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు.బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఉచిత శిక్షణకు ఈ నెల 26వ తేదీ ఉదయం 11గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఎంపికలు ఉంటాయని, అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. ఎంపికైన వారికి దివర్యంజల్, కొంపెల్లి, సికింద్రాబాద్, మేడ్చెల్ క్యాంపస్‌లలో శిక్షణ, ఉచిత భోజనం, వసతి, ట్రాక్‌సూట్ ఇవ్వనున్నట్లు చెప్పారు.

172
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...