ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని తాగాలి


Thu,February 21, 2019 03:10 AM

-బాలవికాస వాటర్ ప్లాంట్ జిల్లా బాధ్యుడు ప్రతాప్‌రెడ్డి
నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 20: గ్రామాల్లోని ప్రజలు స్వచ్ఛమైన నీటినే తాగాలని బాల వికాస వాటర్ ప్లాంట్ జిల్లా బాధ్యుడు ప్రతాప్‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని లక్నెపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాల వికాస డీఫ్లోరైడ్ వాటర్ ప్లాంట్ 12వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాంట్ అధ్యక్షుడు చలువాజీ రామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రతాప్‌రెడ్డి హాజరై మాట్లాడారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే బాలవికాస ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను నెలకొల్పినట్లు చెప్పారు.గ్రామాల్లోని ప్రజలు ఆయా వాటర్ ప్లాంట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలవికాస ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. లక్నెపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామంలోని ప్రజల సలహాలు, సూచనలు, సహకారం తప్పక ఉండాలని కోరారు. లక్నెపల్లి బాల వికాస అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వాటర్ ప్లాంట్‌ను చక్కగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. అంతకు ముందు వాటర్ ప్లాంట్ కార్యనిర్వాహక కార్యక్రమాలను అధ్యక్ష, కార్యదర్శులు చదివి వినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల రాంబాబు, బాల వికాస డీఫ్లోరైడ్ వాటర్ ప్లాంట్ కార్యదర్శి నల్లపూరి లక్ష్మీనర్సయ్య, ఉప సర్పంచ్ పరాచికపు సంతోశ్, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...