మంత్రి, ఎంపీల కృషితోనే ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్


Thu,February 21, 2019 03:09 AM

కమలాపూర్ : మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ కృషితోనే ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ కాగజ్‌నగర్, జమ్మికుంటలో నాగపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగనున్నాయని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్ అన్నారు. ఈటల స్వగృహంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కృషి చేసిన మంత్రి , ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ నవీన్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు మౌటం సంపత్, కొలిపాక రాములు, కొల్గూరి రాజ్‌కుమార్, పిల్లి సతీశ్, తడుక శ్రీకాంత్, కొండం శ్రీనివాస్, ఆనందం పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...