పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


Thu,February 21, 2019 03:09 AM

మడికొండ, ఫిబ్రవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లేబర్ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్‌బాబు సూచించారు. 33వ డివిజన్ భట్టుపల్లి గ్రామంలో శ్రీరామేశ్వర భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం అసంఘటిత కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తప్పని సరిగా కార్మికశాఖ గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవీందర్, రాజేశ్వర్, శ్రీధర్, సంఘం సభ్యులు ఇమ్మడి బాబు, రాజారపు స్వామి, బొందుగుల అశోక్, బొందుగుల ప్రభాకర్, నాగపురి భాస్కర్, బొందుగుల రాజు, మగ్గిడి రమేశ్, సునీల్, కేదారి, దర్గయ్య, చంద్రమౌళి, గుమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...