మంత్రి ఈటలకు అభినందనల వెల్లువ


Thu,February 21, 2019 03:09 AM

కమలాపూర్ : వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో మండలంలోని మర్రిపెల్లిగూడెం, కమలాపూర్, గూడూరు, శనిగరం, అంబాల, శ్రీరాంలపల్లి, కన్నూరు, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్‌పల్లి, ఉప్పల్ తదితర గ్రామాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
భీమదేవరపల్లిలో...
భీమదేవరపల్లి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్రనాయకులు, వృక్షప్రసాదం దాత జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మార్యద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువ కప్పి సన్మానించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...