నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యం


Wed,February 20, 2019 02:19 AM

- డీఎంహెచ్‌వో డాక్టర్ బీ హరీశ్‌రాజ్
రెడ్డికాలనీ, ఫిబ్రవరి 19 : ఒకటి నుంచి 19 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ డీ వార్మింగ్ మాత్రలు (ఆల్బెండజోల్) ప్రతీ ఆరు నెలలకోసారి తప్పక ఇప్పించాలని వరంగల్ అర్బన్ డీఎంహెచ్‌వో డాక్టర్ బీ హరీశ్‌రాజ్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని ప్రాక్టీసింగ్ స్కూల్‌లో జిల్లా విద్యాశాఖాధికారి కే నారాయణరెడ్డి, జిల్లా శిశు సంక్షేమాధికారి సబితతో కలిసి పిల్లలకు మాత్రలను అందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రాజ్ మాట్లాడారు. 1-5 సంవత్సరాల పిల్లలకు అం గన్‌వాడీ కేంద్రాల్లో, 6-19 సంవత్సరాల వారికి ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలల్లో భోజన విరామం సమయం లో మాత్రలు వేస్తున్నామన్నారు. ఏమైనా కారణాల వల్ల మాత్రలు తీసుకోని వారికి ఈ నెల 23న ఇవ్వను న్నట్లు తెలిపారు. పిల్లలు చేతులు శుభ్రత పాటిస్తే చాలా వ్యాధుల దరిచేరవన్నారు. డీఈవో కే నారాయణరెడ్డి మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో తరుచుగా కడుపునొప్పి, రక్తహీనత, ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకుని ఇప్పించాలన్నారు. జిల్లా శిశు సంక్షేమాధికారి సబి త మాట్లాడుతూ మాత్రల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, మాత్రలు వేసుకోనందువల్లే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూ టీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఎండీ యాకుబ్‌పాషా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీతాలక్ష్మి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కృష్ణారావు, పీఎస్ మల్లికార్జున్, హెచ్‌ఎం స్వర్ణలత, వైద్యాధికారి డాక్టర్ నవీన్, డీఈఎంవో వీ అశోక్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ఎం డీపీఎం డాక్టర్ శ్రీనివాసరావు, డీఈఐసీ మేనేజర్ అనిల్, కౌశిక్, ప్రేమలత, ఏఎన్‌ఎం మమత తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...