అటల్ టింకరింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి


Wed,February 20, 2019 02:17 AM

-జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి
న్యూశాయంపేట, ఫిబ్రవరి19 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల ఉన్నత పాఠశాలలకు కేంద్ర ప్రభు త్వ మంజూరు చేసే అటల్ టింకరింగ్ లాబ్‌కు ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖాధికారి కంకంటి నారాయణరెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 400 కు పైగా విద్యార్థులు ఉన్న అన్ని యాజమాన్యాలలో ఉన్నత పాఠశాలన్నింటికి ఈ లాబ్ ఏర్పాటు చేసుకోవడానికి అర్హత ఉందని చెప్పారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధాయులు, ప్రిన్సిపాల్స్, ఎస్‌వోలు సంబంధిత మండలాల విద్యాశాఖాధికారులు బాధ్యత తీసుకోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి ఏటీఎల్‌కు తప్పని సరి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏటీఎల్‌కు ఎంపికైన పాఠశాలలకు రూ.10లక్షలు సైన్స్ సామగ్రికి మంజూరవుతాయని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...