ఘనంగా రేణుక ఎల్లమ్మ పండుగ


Wed,February 20, 2019 02:17 AM

ఐనవోలు : ఐనవోలు మల్లికార్జునస్వామి ఉప దేవాలయమైన రేణుకా ఎల్లమ్మ తల్లికి మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని రేణుకా ఎల్లమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయం అర్చకులు వేకువజాము నుంచే గణపతి పూజ, పుణ్యాహవచనం, మండల ఆరాధన, పంచామృతాలతో అమ్మవారి అభిషేకం, నూతన వస్ర్తాలంకరణ, సహస్ర కుంకుమార్చనలు, మహానివేదన నీరాజన మత్రపుష్పం వంటి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దెంకి నాగేశ్వర్‌రావు, ఉప ముఖ్య అర్చకులు నందనం శివరాజయ్య, వేదపండిత్ పురుషోత్తమ శర్మ, పురోహిత్ ఐనవోలు మధుకర్ శర్మ, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ధర్మసాగర్ : ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని (ఎన్‌డీడీ) (నేషనల్ ఢీ వార్మింగ్ డే) జాతీయ నులిపురుగుల నివారణ ప్రత్యేక ప్రోగ్రాం అర్బన్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు. ధర్మసాగర్, వేలేరు మండలంలోని కేజీబీవీ విద్యాలయాల్లో మంగళవారం నులిపురుగుల నివారణ కోసం విద్యార్థులకు తెలియజేశారు. మధ్యాహ్నం ధర్మసాగర్ కేజీబీవీ ప్రత్యేక అధికారిణి ముత్తిరెడ్డి నీరజరెడ్డి విద్యార్థులకు నివారణ మాత్రలను వేశారు. రెండు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వేశారు. కార్యక్రమంలో సీఆర్‌టీలు, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం ప్రశాంత పాల్గొన్నారు.

514
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...