అసత్య ఆరోపణలను ఖండిస్తున్నాం..


Tue,February 19, 2019 03:22 AM

-డీఈవో నారాయణరెడ్డి
న్యూశాయంపేట, ఫిబ్రవరి 18 : జిల్లాలో పదోతరగతి ప్రీ ఫైనల్ పరీక్షల కోసం గతేడాది సెట్-2పేపర్‌ను వాడుతూ జిల్లా డీసీఈబీ ప్రింటింగ్ డబ్బులు నొక్కేస్తున్నాయన్న ఆరోపణలు అసత్యం, నిరాధారమైనవని డీఈవో కంకంటి నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక పత్రికలో వచ్చిన వార్తకు (నమస్తే తెలంగాణ కాదు)వార్తకు ఆయన స్పందిస్తూ ఈ ఏడాది పదోతరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు గతేడాది సెట్-2 పేపర్లను వినియోగిస్తున్నామన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్నదని, కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ పరీక్షల వారి ఆదేశాలు, ఎస్‌సీఈఆర్‌టీ గైడ్‌లైన్స్ ఉన్నాయన్నారు. ఫ్రింటింగ్ ఖర్చులు మిగల్చుకోవడానికని ఒక ప్రత్యేక వార్త రాయడం జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖను అవమానపర్చడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాలను సీల్డు కవర్లతో భద్రంగా పంపిణీ చేశామన్నారు. మండల కేంద్రాల్లో అన్ని సెంటర్లలో బల్క్ ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంచామన్నారు. పర్యవేక్షణ కూడా పకడ్బందీగా జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షా ఫలితాలు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సేకరించి విశ్లేషించి విద్యాశాఖాధికారికి సమర్పించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు అన్ని పాఠశాలల్లో జరిగిన స్లిప్ టెస్టు ఫలితాలు డీసీఈబీ వద్ద ఉన్నాయన్నారు. అన్ని ఫార్మాట్ ఫలితాలు ఎస్‌ఎ-1ఫలితాలు అన్‌లైన్లో అప్‌లోడ్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఆయన స్పష్టం చేశా రు. ఎంఈవోలు, మండల స్థాయి సీనియర్ హెచ్‌ఎంలతో కూడిన అబ్జర్వేషన్ టీంలు, ప్రస్తుతం ఎస్సెస్సీ ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్ టీంలు పాఠశాలలను సందర్శిస్తూ ప్రైవేట్ పాఠశాలల్లోని పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ ప్రశ్నా పత్రాలతో పరీక్ష నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా కఠిన చర్య లు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...