ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి


Tue,February 19, 2019 03:21 AM

-బల్దియా గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కమిషనర్
వరంగల్,నమస్తేతెలంగాణ: ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని బల్దియా కమిషనర్ రవికిరణ్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన స్వయంగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బల్దియా గ్రీవెన్స్‌పై నమ్మకంలో ప్రజలు వినతులు ఇస్తున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. వింగ్ అధికారులు తమ విభాగాలకు సంబంధించిన వినతులు పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రతి వారం వచ్చిన వినతులు పరిష్కారంపై అధికారులతో సమీక్ష చేసుకోవాలని అన్నారు. ఒకే సమస్యపై పదేపదే ప్రజలు గ్రీవెన్స్‌లో వినతులు ఇవ్వడం మంచిదికాదని అన్నారు.
వినతుల వెల్లువ
బల్దియా గ్రీవెన్స్‌లో వినతులు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో వినతులు ఇవ్వడానికి ప్రజలు గ్రీవెన్స్‌కు వచ్చారు. పలుకాలనీల అభివృద్ధి కమిటీ సభ్యులు కమిషనర్‌ను కలిసి సమస్యలను ఏకరవు పెట్టారు
n పోస్టల్‌కాలనీలోని పార్క్‌లో కనీస వసతులు కరువయ్యాయని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వసతులు కల్పించాలని కాలనీ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండారి జనార్దన్ గౌడ్ గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేశారు.
n శంభునిపేటలోని 19-9-393 చెందిన దోగ్గెల జ్యోతేశ్వర్‌రావు తనకు చెందిన 123,124,,125 సర్వే నెంబర్‌లోని భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కమిషనర్‌ను కోరారు.
n 22వ డివిజన్‌లోని 17-8-123లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేసుకున్నామని, ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని వెంటనే బిల్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఖాజామోహినుద్దీన్ గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేశారు.
n 44వ డివిజన్‌లోని పోచమ్మకుంటలో ముప్పిడి శ్యామ్‌సుందర్ రెడ్డి కార్పొరేషన్ నియమ,నిబంధనలకు విరుద్ధ్దంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని పుప్పాల రజినీ కాంత్ గ్రీవెన్స్‌లో వినతి పత్రం ఇచ్చారు.
n 2012-13 సంవత్సరంలో కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పని చేశానని, తనకు రూ.73,360 రావాల్సి ఉందని పైడిపెల్లికి చెందిన జన్ను సుధాకర్ గ్రీవెన్స్‌లో వినతి పత్రం ఇచ్చారు.
n కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుడిగా పని చేసి మరణించిన షేక్ గఫూర్ స్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని భార్య హబీబ్ బేగం వినతి ప్రతం అందజేశారు.
n శంభునిపేటలోని 19-11-267 ఇంటిలో నల్లా రావడం లేదని, నల్లా పన్ను చెల్లిస్తున్నామని, వెంటనే నల్లా కనెక్షన్ ఇవ్వాలని ఎండీ రషీద్ గ్రీవెన్స్‌లో వినతి పత్రం అందజేశారు.
n 27 డివిజన్‌ను సర్కిల్ 4( నక్కలగుట్ట) లో చేర్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానిని సర్కిల్ 1 కాశీబుగ్గలో చేర్చాలని శ్రీరాముల సురేశ్ గ్రీవెన్స్‌లో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
62 వినతులు..
బల్దియా గ్రీవెన్స్‌లో వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 62 వినతులు వచ్చాయి. అత్యధికంగా 22 టౌన్‌ప్లానింగ్ విభాగానికి, 18 ఇంజినీరింగ్, 10 పన్నుల విభాగం, 7 ప్రజారోగ్య విభాగం, 4 సాధారణ పరిపాలన, 1 పెన్షన్ విభాగానికి వచ్చాయి. ఈ గ్రీవెన్స్‌లో ఆదనపు కమిషనర్ నాగేశ్వర్, ఆర్‌ఎఫ్‌వో నారాయణరావు, సిటీ ప్లానర్ నర్సింహచారి, ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, కార్యదర్శి విజయలక్ష్మి, ఎస్‌ఈ భిక్షపతి, సీహెచ్‌వో సునీత, డిప్యూటీ కమిషనర్లు బ్రహ్మయ్య, ప్రశాంతి, రాజు, డీసీపీ నర్సింహరాములు, ఉద్యోగులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...