గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ


Tue,February 19, 2019 03:13 AM

అర్బన్ కలెక్టరేట్, ఫిబ్రవరి 18 : వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు ప్రజలు పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గ్రీవెన్స్‌కు 956 పైగా దరఖాస్తులు రాగా 90 శాతం పింఛన్లు, సదరం సర్టిఫికెట్లకు సంబంధించిన దరఖాస్తులు రాగా మిగిలినవి కార్పొరేషన్ రుణాలు, డబుల్‌బెడ్ రూం ఇళ్ల మంజూరు, ఇతరత్ర సమస్యలపై వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వరంగల్ ఆర్‌డీవో వెంకారెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి విజ్ఞప్తులు స్వీకరించారుర. ఈ సందర్భంగా ఆర్‌డీవో వెంకారెడ్డి మాట్లాడుతూ గ్రీవెన్స్‌కు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. భూ వివాద సమస్యలపై స్థానిక తహసీల్దార్లు తక్షణమే స్పందించాలన్నారు.
పలు ఫిర్యాదులు..
- ఎక్సైజ్ కాలనీలోని ఒక పాఠశాల సమీపంలో స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే స్పీడ్ బ్రేక్‌లు వేయించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
- దివ్యాంగుడనైన తనకు చెవులు వినబడటం లేదని వినికిడి మిషన్ కొనుగోలు చేసుకొనేందుకు ఆర్థిక సాయం చేయాలని కాజీపేట మండలం కుమ్మరి గూడెం గ్రామస్తుడు నార్లగిరి మల్లేశ్ విన్నవించుకున్నాడు.
- హసన్‌పర్తి మండలానికి చెందిన ఎ.శాంతమ్మ వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
- చిరువ్యాపారం కోసం ఎస్సీ కార్పొరేషన్‌లో దరఖాస్తు చేసుకోగా రుణం మంజూరీ అయినప్పటికీ బ్యాంకు అధికారులు వివిధ కారణాలు చూపుతూ లోన్ ఇవ్వడం లేదని ఏనుమాముల గ్రామస్తురాలు సీహెచ్ మరియ విన్నవించుకుంది.
- కాశీబుగ్గలోని ఎస్‌ఆర్ నగర్ వాసులు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరీ చేయాలని విన్నవించుకున్నారు.
- 51వ డివిజన్ ప్రశాంత్‌నగర్ మెయిన్‌రోడ్‌లోని బార్ అండ్ రెస్టారెంట్‌ను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ కాలనీ వాసులు విన్నవించారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...