పూర్తి కావచ్చిన ఆర్వోబీ పనులు


Tue,February 19, 2019 03:12 AM

వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 18: ఎన్నో ఏళ్ళుగా అండర్ రైల్వేగేట్ ప్రాంతవాసులు కలలు గంటున్న ఆర్వోబీ పనులు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్నాయి. సుమారు రూ.30కోట్లతో అండర్ రైల్వేగేట్ ప్రాంత రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి నిర్మిస్తున్న ఆర్వోబీ నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రైల్వేలైన్‌పై చేపట్టిన ఐరన్ గడ్డర్ల నిర్మాణపనులను రైల్వే ఇంజనీరింగ్ అధికారులు జనవరి 8 నుంచి 10 వరకు భారీ క్రేన్లు వినియోగించి నిర్విగ్నంగా పూర్తి చేసిన సంగతి పాఠకులకు విధితమే. సుమారు 45 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన స్టీల్ గడ్లర్లను అనుసంధానిస్తూ ఐరన్ ప్లేట్లు బిగింపు ప్రక్రియను పూర్తి చేసిన సిబ్బంది సోమవారం కాంక్రీట్ పనులు నిర్వహించారు. ఫిబ్రవరి చివరి నాటికి ఆర్వోబీని ప్రజల అవసరాలకు అందుబాటులోకి తీసుకురావడానికి చురుకుగా పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...