అవయవ దానం గొప్పది


Mon,February 18, 2019 03:04 AM

సిద్ధార్థనగర్: అన్ని దానాల్లోకెల్లా అవయవదానం గొప్పద ని తెలంగాణ నేత్ర శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సంద ర్భంగా ఆదివారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని తెలం గాణ జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుమన్ అ ధ్యక్షతన అవయవదాన కార్యక్రమం నిర్వహించారు. కా ర్య క్రమానికి ముఖ్య అతిథిగా అశోక్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా 26 మంది తమ మరణానంతరం నేత్రా లు, పార్థికదేహాదానం చేస్తామని అంగీకార పత్రాలను అం దచేశా రు. అనంతరం ముచ్చర్ల గ్రామం నుంచి అవయ వ దానం చేసిన రవీందర్, స్వప్నను సన్మానిం చారు. కార్యక్రమంలో చక్రధర్, సాయి కృష్ణ, మంజులరావు, హరితరెడ్డి, కమలా మ నోహర్, వికాస్, రోహిత్, రాము, అశోక్, మల్లా రెడ్డి, జాగృ తి నాయకులు పాల్గొన్నారు.

వేయిస్తంభాల ఆలయంలో..


చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభా ఆల యంలో మాగ శుద్ధ ద్వాదశి ఆదివా రం ఉదయం నిత్యాహ్నక కార్యక్రమాలు నిర్వహించారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గోత్ర నామాలతో పూజలు నిర్వహించారు. సీఎం ఆయు రారోగ్యాలతో ఉండాలని, ముఖ్యమంత్రిగా తెలం గాణ రాష్ట్రంలో సుస్థిర పా లన అందించాలని ఆలయ ప్రధా నార్చకులు గంగు ఉపేం ద్రశర్మ, మణికంఠశర్మ, సందీప్ శర్మ ప్రత్యేక పూజలు చేసి, రుద్రాభిషేకం నిర్వహించారు. అదే విధంగా శ్రీశైలం దేవస్థాన ధర్మకర్తగా ఎన్నికైన తెలంగాణకు చెందిన గొల్లపుడి శ్రీధర్ ఆలయాన్ని సందర్శించగా, ఆలయ నాట్య మంటపం లో పూలమాలతో పట్టుశాలువతో సత్కరిం చారు. ఆయన వెంట దుర్గేశ్వరస్వామి దేవస్థానం మాజీ చై ర్మన్ నాగవెల్లి సురేశ్, చాగంటి ప్రకాశ్, నల్లకుంట రవి, తొ నుపునూరి వీరన్న పాల్గొన్నారు.

229
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...