గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి


Mon,February 18, 2019 03:03 AM

హన్మకొండ రూరల్, ఫిబ్రవరి 17 : గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాల ని వర్ధ్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం అర్బన్ జిల్లాలోని వరంగల్ మండలం ఆరేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు సబ్సిడీ కింద అందిస్తున్న గొర్రెల పంపిణీకి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక లాటరీని ఆయన ప్రా రంభించారు. శ్రీకృష్ణ గొర్లకాపరుల సంఘంలో సభ్యులైన గొల్ల కురుమలకు లాటరీ పద్ధ్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయూతనిచ్చే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. అందులో భాగంగానే గొల్ల కురుమలకు సబ్సిడీ గొర్రెల పథకమని చెప్పారు.

భూమిలేని నిరుద్యోగులైన గొల్లకురుమలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఒక్కొక్క యూనిట్ పై ప్రభుత్వం 75 శాతం సబ్సిడీని అందిస్తుందన్నారు. ఒక్కొక్క యూనిట్‌లో ఇరవై ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయని లిపారు. కాపరులు వైద్యాధికారుల సూచనలు పాటించి గొర్రెలు రోగాల భారిన పడకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ వీర భిక్షపతి, వరంగల్ జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, గొల్ల కురుమల సంఘం అధ్యక్షుడు కాడబోయిన భిక్షపతి, పీఏసీఎస్ డైరెక్టర్ కుమారస్వామి, నర్సింగుల సురేశ్, వెటర్నరీ డాక్టర్ సట్ల వెంకట్, ఇక్బాల్, రాజు, బుర్రి వెంకటయ్య, మద్ది దూడయ్య, మంగ నర్సయ్య సంఘ సభ్యులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...