ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో ముందుంటాం


Sun,February 17, 2019 03:23 AM

కాజీపేట, ఫిబ్రవరి 16: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో ముందుంటామని పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు కనికరం సదానందం, మర్యాల కృష్ణ అన్నారు. కాజీపేట పట్టణం విద్యానగర్‌లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 1984-85 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కనికరం సదానందం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాస్‌లను శనివారం పంపిణీ చేశారు.

అనంతరం పాఠశాల వసతులపై ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులను తమవంతు బాధ్యతగా చేర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుంచు అశోక్, వెంకటేశ్, పప్పుల గోవర్ధన్, అనిల్, కుదిపాక వెంకటేశ్, పోతుల సాంబయ్య, వీరస్వామి, రాజిరెడ్డి, మక్సూద్, చంద్రశేకర్, ప్రకాశ్, పరమేశ్, మహమూద్, రవి, జాకీర్ హుస్సేన్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...