తాగునీటి శుద్ధీకరణ పథకంపై అవగాహన సదస్సు


Sun,February 17, 2019 03:22 AM

సిద్ధార్థనగర్, ఫిబ్రవరి 16 : ఫాతిమానగర్‌లోని బాలవికాస ట్రైనింగ్ సెంటర్‌లో శనివారం బాలవికాస తాగునీటి శుద్ధీకరణ పథకంలో భాగంగా చేపడుతున్న శుద్ధిత నీటి ప్లాంట్లపై నూతనంగా ఎన్నికైన 30మంది సర్పంచ్‌లకు, గ్రామ పెద్దలకు, కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో 960గ్రామాల్లో శుద్ధిత నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి, కేవలం రూ.3కే 20లీటర్ల మంచినీటిని అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బాలమోహన్, శ్రీనివాస్, రాజశేఖర్, ప్రసూన్, రాజు, అబ్బులు, 50గ్రామాల నుంచి 200మంది హాజరయ్యారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...