వందకే అమత ధార


Sat,February 16, 2019 03:35 AM

- జనరల్ కేటగిరీ నల్లా కనెక్షన్ల డొనేషన్ ఫీజుల రద్దు
- బీపీఎల్‌కు రూపాయి, ఏపీఎల్‌కు రూ.వందకే నల్లా కనెక్షన్
- గ్రేటర్‌లో లక్షా పదివేల కుటంబాలకు లబ్ధి
- నగర ప్రజలకు అందుతున్న స్వరాష్ట్ర ఫలాలు
వరంగల్,నమస్తేతెలంగాణ : స్వరాష్ట్ర ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుతున్నాయి. పేదోడికి నల్లా కనెక్షన్ గగనమైన రోజుల నుంచి ఇంటింటికీ నల్లా కనెక్షన్ రోజులు వచ్చాయి. రక్షిత తాగునీరు పేదోడి హక్కుగా గుర్తించిన తెలంగాణ సర్కారు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ అందచేసి పేద కుటుంబాల్లో చిరునవ్వులు నింపింది. కార్పొరేషన్ ట్యాంకర్ వస్తే చాలు బిందెడు నీళ్ల కోసం యుద్ధ్దం చేసే వారంతా కేసీఆర్ ప్రకటించిన ఒక్క రూపాయి నల్లా కనెక్షన్లు తీసుకుని రక్షిత తాగునీరు తాగుతున్నారు. ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భగీరథ ప్రయత్నం ఇప్పుడు ఇంటింటికీ చేరనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.

మరో రెండునెలల్లో మిషన్ భగీరథ పూర్తి కానున్న తరుణంలో గ్రేటర్ పరిధిలోని ప్రతీ ఇంటికి నల్లా రాబోతున్నది. దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) పరిధిలోని కుటుంబాలకు ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ ఇస్తున్నారు. అయితే దారిద్య్రరేఖకు ఎగువ(ఏపీఎల్) పరిధిలోని కుటుంబాలు జనరల్ కేటగిరీలో నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రూ.15వేలు ఖర్చవుతోంది. దీంతో చాలా కుటుంబాలు జనరల్ కేటగిరీలో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి జంకేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లా కనెక్షన్ల డొనేషన్లను రద్దు చేస్తూ వంద రూపాయలకే ఏపీవో కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇస్తామని ప్రకటించడంతో అయా వర్గాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీంతో గ్రేటర్ పరిధిలోని సుమారు లక్షా పది వేల కుటంబాలకు లబ్ధి చేకూరనుంది. బీపీఎల్, ఏపీఎల్ బేధాలు లేకుండా అన్ని వర్గాలకు నల్లా కనెక్షన్ అందజేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో ఇక ప్రతీ ఇంటి ముంగిట్లోకి నల్లా కనెక్షన్ రానుంది. దీంతో గ్రేటర్ అధికారులు నల్లా కనెక్షన్లు లేని కుటుంబాల లెక్కలు తీస్తున్నారు.

రద్దు కానున్న నల్లా డొనేషన్లు
సీఎం కేసీఆర్ నిర్ణయంతో గ్రేటర్ పరిధిలో జనరల్ కేటగిరీలో నల్లా కనెక్షన్ల డొనేషన్లు రద్దు కానున్నాయి. ఇప్పటి వరకు జనరల్ కేటగిరిలో నల్లా కనెక్షన్ తీసుకోవాలంటే రూ.10,500 డొనేషన్ చెల్లించాల్సి ఉండేది. దీంతో పాటు రోడ్డు కటింగ్ పేరిట చార్జీలు వసూళ్లు చేసేవారు. సీసీ రోడ్డు కటింగ్‌కు మీటర్‌కు రూ.900, బీటీ రోడ్డుకు రూ.400 చోప్పున చార్జీలు వసూళ్లు చేసేవారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిర్ణయంతో డొనేషన్ ఫీజులు లేకుండా కేవలం వంద రూపాయల డిపాజిట్‌తో నల్లా కనెక్షన్ పొందే అవకాశం కలిగింది. తెలంగాణ సర్కారు కోలువుదీరిన మొదటి రోజుల్లోనే దారిద్య్రరేఖకు దిగువ ఉన్న వర్గాలకు రూ.200 నల్లా కనెక్షన్‌ను ఒక్క రూపాయికి తగ్గించారు. ప్రస్తుతం దారిద్య్రరేఖకు ఎగువ ఉన్న వర్గాలకు సైతం డొనేషన్ ఫీజులను తగ్గించి కేవలం వంద రూపాయలకే నల్లా కనెక్షన్ ప్రకటించారు. దీంతో సీఎం కేసీఆర్ నిర్ణయంతో గ్రేటర్ పరిధిలోని అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్ రానుంది.

నగర ప్రజలకు స్వరాష్ట్ర ఫలాలు
నగర ప్రజలకు ఒక్కొక్కటిగా స్వరాష్ట్ర ఫలాలు అందుతున్నా యి. గత పాలకుల నిర్ణయాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తూ ప్రజా సంక్షేమ నిర్ణయాలతో ప్రజలకు సత్ఫలితాలను అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన త ర్వాత రూ.200 నల్లా కనెక్షన్‌ను రూపాయికి అందిస్తూ పేదలకు రక్షిత తాగునీరు అందిస్తున్నారు. ఇప్పడు భారీగా ఉన్న జనరల్ కేటగిరీలో నల్లా కనెక్షన్ డొనేషన్ ఫీజును తగ్గిస్తూ వంద రూపాలయకే అన్ని వర్గాలకు నల్లా కనెక్షన్ అందించే చారిత్రక నిర్ణ యం తీసుకున్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచాల న్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత పాలకులు ఏనాడూ ఆలోచన చేయని విధంగా నగరాభివృద్ధి కోసం ప్రతీ బడ్జెట్‌లో రూ.300 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.900 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు నగరంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో పరుగులు పెడుతున్నా యి. మరో మూడు నెలల్లో స్వరాష్ట్ర ఫలాలు సగటు నగర జీవి కళ్ల ముందు కనిపించనున్నాయి. ఉద్యమ గడ్డ వరంగల్ నగరానికి అభివృద్ది ఫలాలను అందించడంలో పెద్దపీట వేస్తోంది.

గ్రేటర్‌లో లక్షా 10 వేల కుటుంబాలకు లబ్ధి
సీఎం కేసీఆర్ నిర్ణయం గ్రేటర్‌లో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఏపీఎల్ పరిధిలోని జనరల్ కేటగిరీలో నల్లా కనెక్ష్షన్ డొ నేషన్ ఫీజులు రూ.10,500 తగ్గిస్తూ కేవలం వంద రూపాయలకే నల్లా కనెక్షన్ అందిస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో గ్రేటర్‌లో సుమారు లక్షా 10 వేల కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. 42 గ్రామాల విలీనంతో మహా నగరంలో సుమారు 2.25 లక్షల గృహాలు ఉన్నాయని అధికారుల అంచనా. అయితే గ్రేటర్ అధికారిక లెక్కల ప్రకారం 1.10 లక్షల గృహాలకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉండగా, మరో క్షా 10 వేల గృహాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం గ్రేటర్‌లో ఇంటినంబర్లు కలిగిన గృహాలు రెండు లక్షల వరకు ఉన్నాయని, మిగతా గృహాలకు ఇంటినంబర్లు కేటాయించాల్సి ఉంది. అయితే నల్లా కనెక్షన్ పొందాలంటే ఇంటినంబర్ ప్రమాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఇంటినంబర్లు లేని గృహాలను సర్వే చేసి వారికి హోల్డర్ పేరిట ఇంటినంబర్లు కేటాయించాలని ఇటీవల సమీక్షా సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అధికారులను సూచించిన విషయం తెలిసిందే.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...