నాణ్యమైన విద్యను అందించాలి


Sat,February 16, 2019 03:26 AM

రెడ్డికాలనీ, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు పొందిన కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేస్తూ, న్యాక్ రీఅక్రిడిటేషన్ విధానాల మేరకు ప్రోగ్రాం ఆఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం రికార్డులు తయారు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ పాము వెంకటేశ్వర్లు కోరారు. న్యాక్ సభ్యకార్యదర్శి డాక్టర్ రాంభాస్కర్‌రాజు అధ్యక్షతన కళాశాల 18 విభాగాధిపతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంశాలవారీగా నివేదికలతో సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల కమిషనర్ ఆదేశాల మేరకు రూ.5వేలు విలువైన స్టేషనరీని మొదటగా గ్రంథాలయ సమాచార శాస్త్ర విభాగాధిపతి పల్లెర్ల శంకరయ్యకు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంభాస్కర్‌రాజు, విష్ణుచరణ్, డాక్టర్ సురేశ్‌బాబు, వివిధ విభాగాధిపతులు శ్యామ చంద్ర, ఇందిరా నైనాదేవి, డాక్టర్ పల్లవి, ప్రభాకర్, కమలాకర్, సోమనర్సయ్య, వినోదర్‌రావు, యూసఫ్ హుస్సేన్, విజయపాల్‌రెడ్డి, మల్లయ్య, గణపతిరావు, సోమన్న, అశోక్ పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...