సమ్మక్క-పగిడిద్దరాజుల పెళ్లికి భారీగా తరలివచ్చిన భక్తులు


Sat,February 16, 2019 03:26 AM

మంగపేట ఫిబ్రవరి 15 : మంగపేట మండలం మల్లూరు గ్రామ పంచాయతీ పరిధి మామిడిగూడెంలో నాలుగు రోజులుగా సాగుతున్న సమ్మక్క-సారక్క జాతరలో భాగంగా శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రధాన ఘట్టమైన సమ్మక్క-పగిడిద్దరాజుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర గ్రామాల్లో నుంచి భక్తులు తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆనవాయితీ ప్రకారం వివాహానికి రెండు రోజుల ముందుగానే బ్రాహ్మణపల్లి నుంచి దారెల్లి అమ్మవారిని, ఒక రోజు ముందు మల్లూరు గుట్ట నుంచి వన దేవతను, గ్రామంలో గుడి నుంచి లక్ష్మీదేవరను, పోతురాజు-మహాలక్ష్మి అమ్మవార్లను గిరిజన మేళ వాయిద్యాలతో మామిడిగూడెంలోని గుడికి తీసుకొచ్చి ప్రతిష్టించారు. అనంతరం గంగ స్నానాల కార్యక్రమం జరిపి పూజలు చేశారు. దేవతల సమక్షంలో సమ్మక్క-పగిడిద్దరాజులకు ఎదుర్కోలు వేడుకలు నిర్వహించారు. సమ్మక్క తరుపున ఒకరు, పగిడిద్ద రాజు తరుపున ఒకరిని పెళ్లి పీఠల కూర్చోబెట్టి మైలపోలు తీయడం, తలంబ్రాలు పోయడం తదితర కార్యక్రమాల నిర్వహించారు. పూజారులు, దేవరబాలలు, వడ్డెల ఆధ్వర్యంలో సమ్మక్క-పగిడిద్ద రాజుకు కల్యాణం జరిపించి, ఊయల సేవ నిర్వహించారు. శనివారం మొక్కు చెల్లింపులు జరిపాక, దేవతల వన ప్రవేశం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో సమ్మక్క సారక్క జాతర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లెబోయిన లక్ష్మణ్‌రావు, వైస్ చైర్మన్ తోలెం శ్రీనివాస్, సలహాదారు మారబోయిన గోవర్ధన్, ఆలయ కమిటీ చైర్మన్ యాలం కాంతారావు, దేవరబాల పూనెం జనార్దన్, సహాయ దేవరబాల యాలం వెంకటేశ్వర్లు, పూజారులు పూనెం వెంకటేశ్వర్లు, రవి కుమార్, భక్తులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...