రెడ్‌క్రాస్ ద్వారా ప్రజల్లో పెరుగుతున్న ధైర్యం


Sat,February 16, 2019 03:25 AM

అర్బన్ కలెక్టరేట్, ఫిబ్రవరి 15 : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సేవలు విస్తృత పరిచి ప్రజల్లో ధైర్యం నింపండం అభినందనీయమని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వలంటీర్స్(సెర్వ్) శిక్షణ తరగతులు శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా గార్డియన్ దవాఖాన ఎండీ, ఐఎంఏ స్టేట్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ పీ కాళీప్రసాద్‌రావు హాజరయ్యారు. ముందుగా జమ్ము కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు రెండు నిమిషాలపాటు రెడ్‌క్రాస్ పాలక వర్గం, సిబ్బంది తదితరులు మౌనం పాటించారు. అలాగే రెడ్‌క్రాస్ పౌండర్ హెన్రీడ్యూనాంట్, బ్లడ్‌గ్రూప్ కనిపెట్టిన కార్ల్‌లాన్స్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శిక్షణ తరగతులను గోపాల్‌రావు ప్రారంభించి మట్లాడారు. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడం అభినందనీయమన్నారు.

ఎక్కడైనా ప్రకృతి విపత్తు సంభవించిందంటే రెడ్‌క్రాస్ సంస్థ వారు ముందు ఉండి సేవచేస్తారన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్‌గా ఏర్పడి ప్రపంచ దేశాలలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు అన్ని దేశాలు స్పందించి తక్షణ వైద్య సాయం, వాళ్ల అవసరాలకు తగ్గట్లుగా సేవలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులను చూసి చలించిన సీఎండీ తమ ఎన్పీడీసీఎల్ సంస్థ ద్వారా తర్వరలోనే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సంస్థకు తమ వంతు సహకారం ఉంటుందని చెప్పారు. డాక్టర్ కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ వరంగల్ రెడ్‌క్రాస్ సొసైటీ చేస్తున్న సామాజిక సేవలు అమూల్యమైనవని అన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ తరుపున చైర్మన్ డాక్టర్ పీ విజయచందర్‌రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో బ్యాంకాగ్‌లో జరిగే వర్క్‌షాపునకు వరంగల్ నుంచి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ పాలకవర్గం సభ్యులు గోపాల్‌రావు, డాక్టర్ కాళీప్రసాద్‌ను రెడ్‌క్రాస్ పిన్, టీషర్ట్, క్యాప్, బ్యాగ్ మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పీ విజయచందర్‌రెడ్డి, ట్రెజరర్ ఎం నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సబ్యుడు ఈవీ శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు బొమ్మినేని పాపిరెడ్డి, డాక్టర్ టీ విజయలక్ష్మి, చెన్నమనేని జయశ్రీ, సెర్వ్ శిక్షకుడు విజయ్‌కుమార్‌బాబు, రమణ, రాష్టంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన వలంటీర్లు, రెడ్‌క్రాస్ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...