మొదటి విడత ఈవీఎంల పరిశీలన


Sat,February 16, 2019 03:25 AM

కాశీబుగ్గ, ఫిబ్రవరి15 : ఏనుమాముల మార్కెట్‌లోని పత్తియార్డు గోదాంలలో భద్రపరిచిన మొదటి విడత వచ్చిన ఈవీఎంలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల పిటిషన్ దాఖలైనందున వరంగల్‌తూర్పు నియోజకవర్గానికి వినియోగించిన ఈవీఎంలను రిటర్నింగ్ అధికారి స్ట్రాంగ్ రూం నందు భద్రపరిచినట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఈవీఎంలను పార్లమెంట్ ఎన్నికలకు మొదటి విడత తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, వరంగల్‌తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్ నుంచి కొత్త ఈవీఎంలు తెప్పించనున్నట్లు తెలిపారు. మొదటి విడత తనిఖీల అనంతరం ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే మొదటి విడత ర్యాండమైజేషన్ చేసి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయిస్తారని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి గోదాంలో భద్రపరిచి ఈవీఎంల రక్షణకు తీసుకున్న చర్యలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెంకారెడ్డి, వైవీ గణేశ్, వివిధ పార్టీ నాయకులు ఈవీ శ్రీనివాస్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, ఎన్నికల విభాగం అధికారులు, బెల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...