నాణ్యమైన పంటల దిగుబడికి వినూత్న సలహాలు


Sat,February 16, 2019 03:25 AM

నయీంనగర్, ఫిబ్రవరి 15 : రైతులు నాణ్యమైన పంటలు దిగుబడి చేసేందుకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎప్పటికప్పుడు వినూత్నమైన సలహాలు అందిస్తున్నదని రేడియా కిసాన్‌వాణి ప్రోగ్రాం హెడ్ పీ గోపాల్‌రావు అన్నారు. కేయూ రోడ్డులోని వరంగల్ ఆకాశవాణి కేంద్రంలో శుక్రవారం కిసాన్‌దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 12 మంది ఉత్తమ రైతులను ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. అనంతరం పీ గోపాల్ రావు మాట్లాడుతూ కిసాన్‌వాణి, పొలం కబుర్లు కార్యక్రమం ద్వారా రైతులకు వివిధ పథకాలు, పంటల గురించి సలహాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ ఎంవీ వరప్రసాద్ మాట్లాడుతూ 2015 నుంచి కిసాన్‌వాణి కార్యక్రమం ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కాలానికి అనుగుణంగా పంట విధానంలో మార్పులు చేసుకుంటే మనుగడ సాధించడం సులభతరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆకావవాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మణి మంజరీదేవి, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర అసొసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ రఘురాంరెడ్డి, ఎస్‌బీఐ హన్మకొండ బ్రాంచీ మేనేజర్ ఎం సత్యనారాయణ, పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆకాశ వాణి కేంద్రం సిబ్బంది నిహార, రవికుమార్, కేశవరావు, సాంకేతిక విభాగం నుంచి రజినీ కాంత్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, శివాజీ, ఉషశ్రీ, శ్రీనువాసాచారి, రత్నపాప, లక్ష్యయ్య, కిసాన్‌వాణి సమర్పకులు డాక్టర్ పీ ఎల్లయ్య, ఎస్ రాజ్‌కుమార్, హర్షం సదానందం, చీరంజివి తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...