వాగ్ధేవిలో అంతర్జాతీయ ఫార్మసీ సదస్సు


Thu,September 20, 2018 04:11 AM

-మఖ్యఅతిధిగా హాజరైన వులేగా యూనివర్సిటీ
-ప్రొఫెసర్ సురేశ్ వీ చెన్నుపాటి
మామునూరు,సెప్టెంబర్ 19 : నగరంలోని ఐదో డివిజన్ బొల్లికుంట వాగ్ధేవి కళాశాలలో బుధవారం ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ ప్రొఫెసర్ వై.మధుసుదన్‌రావు అధ్యక్షతన ఫార్మసీ విద్యాసంస్థలు, ఏపీ (అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్) సంయుక్తంగా 15వ ఇండో-ఆఫ్రికన్ అంతర్జాతీయ ఫార్మసీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సురేశ్ వీ చెన్నుపాటి హాజరై గ్లోబల్ ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ట్రాన్స్‌లేషనల్ రిసెర్ఛ్ అండ్ హెర్బల్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగించారు. రోగాల నియంత్రణ కోసమే ఔషద రంగం ఆవిర్భవించిందని, నూతన రోగాలు ఆవిర్భవించిన కొద్దీ పరిశోధనారంగం విస్తృతమవుతున్నాయని పరిశోదనల ఫలితంగా ఔషద పారిశ్రామికరంగం అభివృద్ధి చెందుతోందన్నారు. అందువల్లే ఫార్మసీ విద్యకు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని ఆయన అన్నారు. అనంతరం వివిధ అంశాలపై పలువురు ఔషదరం గ మేధావులు ఫార్మసీ నూతన దోరణులపై ప్రసంగించారు. రెండు దఫాలుగా జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి పాల్గొన్న ఫార్మసీ అధ్యాపకులు, విద్యార్థులు 200 సైంటిఫిక్ పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం అబ్‌స్ట్రాక్ట్ సీడీని ఆవిష్కరించారు. తమ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించినందుకు యాజమా న్యం దేవేందర్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ జీ కమల్‌యాదవ్, డాక్టర్ గురునాధ్, ప్రొఫెసర్ హిమజ, డాక్టర్స్ రామారావు, దిగంభర బాలక్రిష్ణఅంబేకర్, శివకుమార్, పద్మజా, ఫార్మసీ విధ్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...