గణేశ్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు


Thu,September 20, 2018 04:10 AM

-15 క్రేన్ల సిద్ధం చేస్తున్న అధికారులు
-అప్రోచ్ రోడ్ల మరమ్మతులు
-బల్దియా, పోలీస్, ఇరిగేషన్,మత్స్య శాఖలసమన్వయం
వరంగల్, నమస్తేతెలంగాణ : గణేశ్ నిమజ్జనానికి బల్దియా అధికారులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో చిన్న, పెద్ద గణేశ్ విగ్రహాలు సుమారు 5 వేల వరకు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో నిమజ్జన చెరువుకు అధికారులను నియమించి పనులను వేగవంతం చేశారు. గ్రేటర్‌లోని చిన్న వడ్డేపల్లి, కోట చెరువు, బంధం చెరువు, రంగసముద్రం, కట్ట మల్లన్న చెరువుల వద్ద అధికారులు నిమజ్జన ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల వద్ద క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్రేన్‌కు ఒక తెప్ప ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. చెరువులకు వెళ్లేదారులను, గుంతలపై ప్యాచ్ వర్క్స్ కార్పొరేషన్ అధికారులు మర మ్మతు చేయిస్తున్నారు. బల్దియా, ఇరిగేషన్, పోలీసులు, మత్స్య శాఖ అధికారులు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లను ముందుకు తీసుకపోతున్నారు. చెరువులను జిల్లా కలెక్టర్ పీజే పాటిల్, గ్రేటర్ కమిషనర్ వీపీ గౌతమ్ సందర్శించి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పుతున్నారు.

15 క్రేన్ల ఏర్పాటు
వినాయక నిమజ్జనం కోసం 15 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు గ్రేటర్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఐదు క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోట చెరువు వద్ద 4 క్రేన్లు , హన్మకొండ , కాజీపేట ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాల కోసం బంధం చెరువు వద్ద మూడు క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. కట్టమల్లన్న చెరువు వద్ద 2 క్రేన్లు, ఉర్సు రంగసముద్రం వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలపారు. పద్మాక్షి గుండంలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో చిన్న విగ్రహల నిమజ్జనం మాత్రమే అధికారులు అనుమతించనున్నారు. పెద్ద విగ్రహలను చిన్న వడ్డేపల్లి, కోటి చెరువలకు మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే హసన్‌పర్తి చెరువు వద్ద బల్దియా అధికారులు నిమజ్జన ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల వద్ద విద్యుత్ ఏర్పాటు చర్యలు తీసుకున్నారు. దీనితో పాటు వీలీన గ్రామాలలో నిమజ్జన చెరువుల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

303
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...