ఆర్టిజన్ కార్మికుల ఆనందహేళ


Wed,September 19, 2018 03:14 AM

-20 ఏళ్ల వెట్టిచాకిరికి విముక్తి
-విద్యుత్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్
-వ్యతిరేక పిల్‌ను కొట్టేసిన కోర్టు
-క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభం
-ఎన్పీడీసీఎల్ పరిధిలో4338 మందికి ప్రయోజనం

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : ఉద్యోగాలు భర్తీ చేయడం చేతగాని అప్పటి ప్రభుత్వాలు అత్యంతకీలకమైన విద్యుత్ శాఖలో విద్యుత్ సరఫరా ప్రక్రియను నడిపేందుకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమించిన కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం విముక్తి కలిగించింది. 15 ఏళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్న ఎట్టి బతుకుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రక్రియకు లైన క్లియర్ అయింది. విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టేసింది. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆర్టీజన్ కార్మికుల రెగ్యులరైజేషన్‌ను పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టారు.

ఉద్యోగుల వెట్టిచాకిరి..
వ్యవసానికి, గృహ అవసరాలకు కీలకంగా ఉండే విద్యు త్ శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకుండా గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు దోచి పెట్టేలా సబ్ స్టేషన్ల నిర్వహణ, ఇతర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియల్లో ఔట్‌సోర్సింగ్ పద్దతిన కార్మికులను తీసుకున్నాయి. ఈ ప్రక్రియ 1997 నుంచి మొదలై ప్రత్యేక రాష్ట్రం లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు కొనసాగింది. మొద ట్లో రూ.800 వేతనాలు మాత్రమే ఉండగా అవి కూడా కార్మికులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు వెట్టిచాకిరి చేయించుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తుండడంతో విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లింది. దీంతో స్పందించిన సీఎం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి వీరిని సంస్థ ఉద్యోగులుగా పరిగణించాలని ఆదేశించారు. ఆ తర్వాత వీరందరినీ రెగ్యులరైజ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే కొందరు గిట్టని వారు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ప్రకియ్రకు బ్రేక్ పడింది. అయినా ఈ ఉద్యోగులకు వేతనాలను పెంచి సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత విద్యుత్ శాఖ న్యాయవాదులు సమర్థవంతంగా వాదించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బాధలను కోర్టులో చెప్పగలిగారు. సంతృప్తి చెందిన కోర్టు వీరి క్రమబద్ధీకరణ సమంజసమేనని మంగళవారం తీర్పునివ్వడంతో ఆర్టిజన్ కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఎన్పీడీసీఎల్ పరిధిలో 4338 మంది
ఆర్టిజన్ కర్మికుల క్రమబద్ధీకరణ సమంజసమేని కోర్టు తీర్పు నివ్వడంతో 2017 జూలైలో ఇచ్చిన క్రమబద్ధీకరణ ఆదేశాల అమలుకు సీఎం కేసీఆర్ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్పీడీసీఎ ల్ పరిధిలో మొత్తం 4338 మంది కార్మికులు విద్యుత్ శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. ఇందులో కార్పొరేట్ ఆఫీసు లో 172 మంది, వరంగల్ సర్కిల్ పరిధిలో 891 మంది, కరీంనగర్ సర్కిల్ 1005, ఖమ్మం సర్కిల్‌లో 508, నిజామాబాద్ సర్కిల్‌లో 1057, ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో 705 మంది ఆర్టీజన్ కార్మికలుగా పని చే స్తున్నారు.

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఆర్టిజన్ కార్మికులకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడం తో కార్మికులు మంగళవారం విద్యుత్ భవన్ వద్ద సంబు రాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

312
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...