ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక


Wed,September 19, 2018 03:11 AM

-ఆమోదం తెలిపిన కలెక్టర్
-10 పథకాలు.. 2778 యూనిట్లు
-ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 18 : ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి జిల్లాలకు లక్ష్యాలకు నిర్ధేశించారు. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాకు వివిధ పథకాల ద్వారా 2778 యూనిట్లుకు గాను రూ.51.19 కోట్ల ప్రణాళికకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆమోదం పొందిన అనంతరం మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేస్తోంది. వివిధ పథకాలకు సంబంధించి బ్యాంకులింకేజీ రుణాలు, నాన్ బ్యాంకింగ్ రుణాల కోసం నిధులు మంజూరు చేశారు. లబ్ధిదారులను గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభల ద్వారా ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఎంపీడీవోలకు, పట్టణ అధికారులకు పంపించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత తెలిపారు. బ్యాంకు లింకేజీ కింద 444 యూనిట్లు (444 మంది), బ్యాంకు లింకేజీ లేకుండా 2,334 యూనిట్లు (2334 మంది) రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందు లో నిరుద్యోగ యువతీ యువకులకు, గ్రామీణ, పట్టణ పరిధిలోని ఒంటరి మహిళలు, భూమిలేని నిరుపేద వ్యసాయకూలీలకు, సన్న చిన్న కారు రైతులకు, తోళ్ల సంబంధిత వ్యాపారులకు, సఫాయికర్మచారులకు, స్కావెంజర్స్‌కు, గుడుంబా బాధిత కుటుంబాలు, అమ్మకాలు చేపట్టేవారు, లొంగిపోయిన నక్సల్స్‌కు, గుడంబా వల్ల చనిపోయిన వారికి పునారావాసం కల్పించేందుకు, ఆర్గనైజ్డ్, ఆన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లలో పనిచేసే వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఈడీ పేర్కొన్నారు.

అర్హతలు.. నిబందనలు
దరఖాస్తుదారుడు ఎస్సీ కులానికి చెందిన వారై ఉండాలి. తప్పని సరిగా ఆధార్ కార్డు గానీ, రేషన్ కార్డు గానీ కలిగి ఉండాలి. ఎకానామిక్ సపోర్టు స్కీంకు సంబంధించి (బ్యాంక్ లింకేజీ స్కీంలు) వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల వయస్సును, వ్యవసాయ అనుబంధ స్కీంలకు 21 నుంచి 60 సంవత్సరాలు, శిక్షణ పథకాలకు సంబంధించి 18 నుంచి 45 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000 లోపు, పట్టణాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుదారుడు ఇదివరకు ఏ సంస్థ నుంచి లబ్ధిపొందరాదు. ఇటీవల మీసేవ ద్వారా తీసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది.

మూడు కేటగిరీలు
వార్షిక ప్రణాళికను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరి -1 ప్రకారం లక్ష రూపాయల వరకు సబ్సిడీ 80 శాతం, బ్యాంకు రుణంగానీ, లబ్ధిదారుడి వాటా ధనం 20 శాతం తప్పనిసరి, రెండో కేటగిరి కింద రెండు లక్షల రూపాయలు యూనిట్ విలువకు 70 శాతం సబ్సిడీకాగా 30 శాతం బ్యాంకు రుణం, మూడో కేటగిరి కింద రెండు లక్షల రూపాయల నుంచి రూ.12 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.5లక్షలు సబ్సిడీ మించకుండా), 40 శాతం బ్యాంకు రుణం. ఈ కేటగిరిలే కాకుండా బ్యాంకు లింకేజీ లేకుండా వంద శాతం సబ్సిడీతో చిరు వ్యాపారులకు రూ.50వేల వరకు రుణం మంజూరు చేస్తారు. ఈ పథకాల ద్వారా రుణాలు పొందేందుకు ఆన్‌లైన్ బెనిఫిషరీ మానీటరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఓబీఎంఎంఎస్) ( www.tsobmms.cgg.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్ర మే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబందించి ఇప్పటికే ఎంపీడీవోలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఈడీ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్ సైట్ ఓపెన్ అయిందన్నారు.

ఆన్‌లైన్ ఓపెన్ అయింది..
- మాధవీలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
ఎస్సీ వార్షిక ప్రణాళికను కలెక్టర్ ఆమోదం లభించింది. ఈ సంవత్సరం 2778 యూనిట్లకు రూ. రూ.51.19 కోట్లతో ప్రణాళికను మంగళవారం విడుదల చేశాం. ఇందుకు సంబందించి ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో అసక్తి, అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత తాము ఎంచుకొన్న స్కీం ద్వారా రుణాలు పొందేందుకుగాను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

366
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...