శ్వేతార్కలో లక్ష గరిక పూజ


Wed,September 19, 2018 03:11 AM

కాజీపేట, సెప్టెంబర్ 18: కాజీపేట శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో గణపతి నవరాత్రి కల్యాణోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామికి లక్ష గరిక పూజను నిర్వహించినట్లు దేవాలయ వ్యవస్థాపకుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామికి గరికతో పూజలు చేస్తే సత్ ఫలితాలు పొందవచ్చని తెలిపారు. వేద పండితులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, కులకర్ని మహేశ్ శర్మ పూజలను ఘనంగా నిర్వహించారు. దేవాలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. అదేవిధంగా దేవాలయంలో మహిళలు సామూహికంగా జ్యేష్ఠాదేవి అమ్మవారికి శతాధిగాజుల పూజను చేశారని తెలిపారు. స్వామికి నేడు కుంకుమాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

303
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...