ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ సేవకుడిగా పనిచేస్తా


Tue,September 18, 2018 03:39 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
హసన్‌పర్తి, సెప్టెంబర్ 17: వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే తిరిగి సేవకుడిగా పని చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఎర్రగట్టుగుట్ట క్రాసురోడ్డులోని బాలాజీ గార్డెన్స్‌లో సోమవారం మండల టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరూరి రమేశ్ హాజరయ్యారు. అంతకుముందు ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల శ్రీధరచార్యులు, వేదాంతం పార్థసారథాచార్యులు తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను నిండు మనసుతో దీవించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆశీర్వదించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వరకు బైక్‌పై ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాద బలంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి సేవకుడిగా పనిచేశానని అన్నారు. అదే నిండు మనసుతో ప్రజలు మరోసారి గెలిపిస్తే మరిన్ని సేవకుడిగా పని చేసి నిరూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కొత్తకొండ సుభాశ్ గౌడ్, ఎంపీపీ కొండపాక సుకన్య, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ ఎల్లావుల లలితాయాదవ్, మండల కన్వీనర్ అంచూరి విజయ్‌కుమార్, కార్పొరేటర్లు నాగమల్ల ఝాన్సీలక్ష్మి, జక్కుల వెంకటేశ్వర్లు యాదవ్, కాయిత సమ్మిరెడ్డి, రాజు నాయక్, కల్పన, ఎర్రగట్టు దేవస్థానం కమిటీ చైర్మన్ అటికం రవీందర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జక్కు రమేశ్ గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు నాగమల్ల సురేశ్, బిల్ల ఉదయ్‌రెడ్డి, కందుకూరి చంద్రమోహన్, విక్టర్‌బాబు, పిట్టల సదానందం తదితరులు పాల్గొన్నారు.

316
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...