స్వచ్ఛ సర్వేక్షణ్-19పై దృష్టి సారించాలి


Tue,September 18, 2018 03:39 AM

-సీడీఎంఏ టీకే శ్రీదేవి
వరంగల్, నమస్తేతెలంగాణ : స్వచ్ఛ సర్వేక్షణ్-19పై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి పారిశుధ్యం, హరితహారం, వడ్డీలేని రుణాలపై ఆమె వీడిమో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛసర్వేక్షణ్‌పై నియమ నిబంధనలు వచ్చాయని వాటికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-19 కు ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాలని ఆమె ఆదేశించారు. వడ్డీలేని రుణాల ప్రొసిడింగ్‌లను వెంటనే జారీ చేయాలని సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి దృవీకరణలు సమర్పించాలని అన్నారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని పొదుపు సంఘాల రివాల్వింగ్ ఫండ్ విడుదల ప్రతిపాదనలు ఈ నెల 22 వరకు అందజేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు పారిశుధ్య చర్యలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అధికారులు శ్రద్ధతో పని చేసి మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. ఈ వీడియా కాన్ఫరెన్స్‌లో ఆర్‌ఎఫ్‌వో నారాయణ రావు, కార్యదర్శి విజయలక్ష్మి, హర్టికల్చర్ అధికారి సునీత, ఈఈ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

279
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...