25నుంచి కేయూ దూర విద్య బీఎల్‌ఐఎస్సీ పరీక్షలు


Tue,September 18, 2018 03:39 AM

హన్మకొండ, నమస్తేతెలంగాణ: కేయూ దూర విద్య కేంద్రం అందిస్తున్న సీఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, పీజీడీబీఎం పరీక్షలు ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రాణాధికారులు ప్రొఫెసర్ మహేందర్‌రెడ్డి, డాక్టర్ వెంకయ్య, దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వీరన్న తెలిపారు. సీఎల్‌ఐఎస్సీ పరీక్షలు సెప్టెంబర్ 25, 27, 29, అక్టోబర్ 1, 4, 6, 8, తేదీల్లో, బీఎల్‌ఐఎస్సీ పరీక్షలు సెప్టెంబర్ 26, 28, 30, అక్టోబర్ 3, 5, 7, 10, 11తేదీల్లో, పీజీడీబీఎం పరీక్షలు- సె ప్టెంబర్ 26, 28, 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5వరకు దూర విద్య కేంద్రంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను కేయూ sdlce.ku ద్వారా డౌన్‌లోడు చేసుకోవచ్చని సూచించారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...