ఈ నెల 30లోగా ఉపకార వేతనాలకు


Thu,September 13, 2018 02:09 AM

-దరఖాస్తు చేసుకోండి : డీడీ కరుణాకర్
అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 12: జిల్లాలో ని కళాశాలల్లో 2018-19 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మె ంట్ కోసం ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సోషల్ వెల్ఫేర్ ఇన్‌చార్జి డీడీ కరుణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన విద్యార్థులు ఎస్సెస్సీ హాల్‌టికెట్ నెంబర్, ఆధారు కార్డు, మీసే వ నుంచి తీసుకున్న కుల, ఆధాయ దృవీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా నెంబర్, వరుసగా ఏడు సంవత్సరాలకు సంబంధించిన స్టడీసర్టిఫికేట్ గాని, బోనఫైడ్ ను గాని, 2018-19కి సంబంధించిన సెట్ అలాట్‌మెంట్ కాపీ( సెట్ విద్యార్థులకు మాత్రమే), ప్రస్తుత పాస్‌పోర్టు పోటో, మొబైల్ నెంబర్‌ను జతచేయాలన్నారు. అలాగే రెన్యూవల్ విద్యార్థులు ఆధారు కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, వరుసగా ఏడు సంవత్సరాలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్‌గాని, బోనఫైడ్ సర్టిఫికేట్ గాని, గత సంవత్సరం పాస్ మెమో, పది రూపాయల స్టాంప్ పేపర్ గల ఒరిజనల్ అఫిడవిట్, మొబైల్ నెంబర్‌ను జతచేయాలి అని తెలిపారు. దరఖాస్తులను w ww.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...