నూతన ఆవిష్కరణలకు చేయూత కోసం


Thu,September 13, 2018 02:07 AM

-టీఈ గ్రాడ్‌తో ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల ఒప్పందం
హసన్‌పర్తి, సెప్టెంబర్ 12: విద్య నుంచి వ్యాపార నిర్వహణ వరకు (ఎడ్యుకేషన్ టూ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్) అనే ఉపశీర్షికతో విద్యార్థులకు వ్యాపార నిర్వహణపై మెలుకువలు నేర్పించి అంకుర సంస్థలకు ఊపిరి పోసే ప్రయత్నంలో భాగంగా దీ ఇండస్ ఎంటర్ ప్రెన్యూర్ (టై) హైదరాబాద్ చాప్టర్‌తో ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల ఒప్పందం కుదుర్చుకుంది. టై అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని పెంపొందించే దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వినూత్న ఆవిష్కరణలకు ఊతంగా మెంటరింగ్ చేస్తూ పెట్టుబడికి మార్గాలను అన్వేశించి అంకుర సంస్థలను నెలకొల్పేందుకు తోడ్పడుతుంది. ఉత్తర తెలంగాణలో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, అంకుర సంస్థలకు బీజం వేసే వేదికగా ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల, ఎస్సార్ ఐఎక్స్ చేస్తున్న కృషికి టై సంస్థతో చేసుకున్న ఒప్పందంతో మరింత వేగవంతమవుతుందని టై ప్రతినిధి సుబ్బరాజు పేరిచర్ల తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ మహేష్, టై ప్రతినిధులు సీఎస్ వాసుదేవరావు, సుబ్బరాజు మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సెంటర్ హెడ్ నరెడ్ల సుమన్‌తో పాటు కళాశాల హెడ్స్, డీన్స్, బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...