ఇసుక డంప్ మాయంపై తహసీల్దార్ ఫిర్యాదు


Thu,September 13, 2018 02:07 AM

ఎల్కతుర్తి: మండలంలోని పెంచికల్‌పేట గ్రామ శివారులో మంగళవారం పట్టుకున్న ఇసుక డంప్ మాయమైన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్ రత్నవీరాచారి చెప్పారు. వివరాల్లోకి వెళ్లితే... పెంచికల్‌పేట గ్రామ శివారులో సుమారు పది ట్రాక్టర్లు ఇసుక డంప్ చేసిన విషయంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి డంప్ వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం తహసీల్దార్ రత్నవీరాచారికి సమాచారం అందించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం ఇసుక డంప్ రక్షణగా స్థానిక వీఆర్‌ఏను ఉంచారు. అయితే రాత్రి సమయంలో ఇసుక అక్రమ ర వాణాదారులు అక్కడ నిల్వ చేసిన ఇసుకను మాయం చేశారు. అర్ధరాత్రి సమయం లో పోలీసులకు సమాచారం అందడంతో ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి చేరుకునే సమయంలోనే ఇసుక అక్రమ రవాణాదారులు అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం ఉదయం ఈ విషయంపై ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తహసీల్దార్‌కు సమాచారం అందజేశారు. రెవెన్యూ సిబ్బంది ఆధీనంలో ఉన్న ఇసుక డంప్ మాయం కావడంతో విచారణ నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...