రాష్ట్ర ఏర్పాటులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర గొప్పది


Thu,September 13, 2018 02:07 AM

-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరా శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం రాత్రి తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ నూతన డైరక్టర్లకు సన్మానం చేశారు. దీనికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తో కలిసి మంత్రి ఈటల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ సరఫరాలో వివిక్ష చూపించాయని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే రాష్ట్రమంతా చీకటి మయమవుతుందని బెదిరించారని వారు గుర్తుచేశారు. అయితే అందరి అనుమానాలను, అవహేళనలను పటాపంచలు చేస్తూ ఈ రోజు వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరాను అందజేస్తున్నామని చెప్పారు. పసికూనలా, ఉన్న మన రాష్ట్రంలో మొదటి విజయం విద్యుత్ రంగానిదేనని ఆయన అన్నారు. ఈ క్రెడిట్ అంతా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఈ రోజు మనం తలెత్తుకు తిరుగుతున్నామంటే దానికి కారణం విద్యుత్ ఉద్యోగుల నిరంతర కృషేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, డైరక్టర్లు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, గణపతి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...