17వ తేదీ వరకుహరితహారం పూర్తికావాలి


Wed,September 12, 2018 03:08 AM

-కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 11: హరితహారం లక్ష్యాన్ని ఈ నెల 17వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలతో హరితహారం ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాకు నిర్ధేశించిన 62లక్షలలో ఇప్పటి వరకు 48లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. ఆయా శాఖలు, మండలాలకు విధించిన టార్గెట్‌ను తప్పకుండా సాధించాలన్నారు. డీఆర్‌డీఏకు నిర్ధేశించిన 25లక్షల మొక్కల్లో 23లక్షలు, ఎక్సైజ్ శాఖ 3లక్షలకుగాను 2.37లక్షలు, వరంగల్ మున్సిపాలిటీ 12 లక్షలకు 10.27లక్షలు, అటవీ శాఖ నిర్ధేశించిన లక్ష మొక్కలు నాటినట్లు తెలిపా రు. వ్యవసాయ శాఖ ద్వారా లక్షా ఏడు వేలు, ఉ ద్యాన, సెరీ కల్చరల్ విభాగాలు 2లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా.. 4.5లక్షల మొక్కలు నాటారని కలెక్టర్ పేర్కొన్నారు. మల్బరీ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించడం వల్ల లక్ష్యాలను అధిగమించినట్లు తెలిపారు. నాటిన మొక్కలకు వంద శాతం జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో రాము పాల్గొన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...