విద్యార్హతలను పెంచేందుకు ఓ వరం ఓపెన్ స్కూల్


Wed,September 12, 2018 03:07 AM

-విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్రాంకుమార్
హన్మకొండ, నమస్తేతెలంగాణ: విద్యాభ్యాసా న్ని మధ్యలో మానేసిన వారికి ఉన్నత విద్యార్హత లను పెంచుకునేందుకుకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక వరం లాంటిదని జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రాంకుమార్ అన్నారు. ఓపెన్ స్కూల్ ఉ మ్మడి జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్‌రావు ఆ ధ్వర్యంలో అర్బన్ విద్యాశాఖాధికారి కార్యాల యంలో విద్యాశాఖ ఉద్యోగులు ఓపెన్ స్కూల్ వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతా ల్లోని పేద, మధ్య తరగతి వారికి ఓపెన్ టెన్త్, ఇం టర్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలు అర్బన్ జిల్లాలో అత్యధికంగా న మోదు చేయాలని సూచించారు. ప్రవేశాలు పొందే అభ్యర్థులు ఫీజులను హెచ్‌ఎంల ద్వారా మీసేవ, ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లిం చాలని అన్నారు. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ము రాల శంకర్‌రావు మాట్లాడుతూ ఓపెన్ టెన్త్, ఇంట ర్‌లో ప్రవేశాలకు ఈనెల 30 చివరి తేదీ అన్నారు. అపరాధ రుసుము లేకుండా ప్రవేశాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి మనోజ్‌కుమార్,సూపరింటెండెంట్ వేణుగోపాల్, హెచ్‌ఎం పట్టాభి, దుర్గం రవి, సీనియర్ అసి స్టెం ట్ గాయత్రి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...